ఏపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల మొదటి జాబితా ప్రకటన

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ ఇప్పటికే అభ్యర్ధులని ప్రకటించింది.

ఇక మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీ కూడా విడతల వారీగా అభ్యర్ధులని ప్రకటిస్తున్నారు.

తాజాగా మరో 13 మంది అభ్యర్ధుల లిస్టు ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఇదిలా ఉంటే ఏపీ విభజనలో భాగమై, ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకతని కలిగి ఉన్న జాతీయ పార్టీలు రెండూ నిన్న తమ అభ్యర్ధులని ప్రకటించాయి.

బీజేపీ పార్టీ మెజార్టీ అభ్యర్ధుల లిస్టు ని ప్రకటించేసింది.ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ మొదటి అభ్యర్ధుల జాబితా ప్రకటించింది.

ఇందులో 132 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులని అలాగే 22 ఎంపీ అభ్యర్ధులని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.ఇందులో సీనియర్ నాయకులతో పాటు కొత్త వారికి కూడా కాంగ్రెస్ అవకాశం కల్పించింది.

Advertisement

అయితే ఈ ఎన్నికలలో జాతీయ పార్టీల రెండింటికి ఏపీ ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదని విషయం తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు