నేడు హైదరాబాద్‎కు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ..!

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.

సాయంత్రం నగరానికి చేరుకోనున్న ఆయన మూడు రోజులపాటు పలు సమీక్షలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర పార్టీపై సీనియర్ నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు.అదేవిధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో మాణిక్ రావు ఠాక్రే సమావేశం కానున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

కాంతివంతమైన ముఖానికి సులువైన చిట్కాలు
Advertisement

తాజా వార్తలు