కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది..: కేటీఆర్

మాజీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ పై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పై మండిపడ్డారు.

కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని కేటీఆర్ విమర్శించారు.హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు.

అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇంతవరకూ చేయలేదని మండిపడ్డారు.మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రుణాలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారన్న ఆయన లేకుంటే కేసులు పెట్టాలని అంటున్నారని విమర్శించారు.420 హామీలు అమలు చేసే వరకు విడిచిపెట్టమన్నారు.ప్రధాని, అదానీ ఒక్కటే రాహుల్ గాంధీ విమర్శలు చేస్తారని చెప్పారు.

కానీ రేవంత్ రెడ్డి మాత్రం అదానీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు.తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.

Advertisement
కాంతివంతమైన ముఖానికి సులువైన చిట్కాలు

తాజా వార్తలు