మంత్రి కేటీఆర్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో దీక్షా దివస్ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఆరోపించింది.

ఈ నేపథ్యంలోనే ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.తక్షణమే దీక్షా దివస్ ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షా దివస్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేయగా తెలంగాణ భవన్ కు ఎన్నికల కమిషన్ స్క్వాడ్ వెళ్లింది.

దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరగా.ఇది కొత్త కార్యక్రమం కాదని, ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

Advertisement

కాగా తెలంగాణభవన్ లో నిర్వహించిన దీక్షా దివస్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు