Deputy CM Bhatti : అసాధ్యాన్ని సాధ్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం..: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో మరో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం( Congress ) ప్రారంభించింది.

ఈ మేరకు సెక్రటేరియట్ లో పథకాలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ), మంత్రులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో శానససభ, శాసనమండలి సభ్యులతో పాటు హైదరాబాద్ మేయర్, అధికారులు పాల్గొన్నారు.ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి ( Deputy CM Bhatti )తెలిపారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్( Gas cylinder for Rs.500 ) అందిస్తామని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తామన్నారు.

ఈ క్రమంలో మార్చి నుంచి జీరో బిల్లు వస్తుందని తెలిపారు.బడుగు, బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

Advertisement

ఆర్థిక పరిస్థితులను చక్కబెడుతూనే హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న భట్టి అసాధ్యాన్ని సైతం సాధ్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు