తిరుమ‌ల త‌ర‌హాలో నెల్లూరులో శ్రీవారి సేవ‌ల నిర్వ‌హ‌ణ‌

తిరుమ‌ల త‌ర‌హాలోనే ప‌లు ప్రాంతాల్లో శ్రీవారి సేవ‌ల‌ను నిర్వ‌హించాల‌ని టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామివారు కొలువైన తిరుమ‌ల ఆల‌యంలో రోజువారీ నిర్వ‌హించే సేవ‌ల‌ను ఇత‌ర ప్రాంతాల్లోని భ‌క్తులు ద‌ర్శించేందుకు వీలుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర వైభవోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తుంది.

దీనిలో భాగంగా నెల్లూరులో ఈ ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభం కానున్నాయి.క‌రోనా కారణంగా రెండున్నరేళ్ల విరామం త‌రువాత నెల్లూరు న‌గ‌రం నుంచి ఈ ఉత్స‌వాల‌ను టీటీడీ పున‌ర్ ప్రారంభించింది.

ఎసి.స్టేడియంలో ఈనెల 16 నుండి 20 వ తేదీ వ‌ర‌కు ఈ ఉత్స‌వాలు జ‌రుగనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాల‌ని సూచించారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)