కొందరిని నమ్మి 60 లక్షలు పోగొట్టుకున్నాను... ఆవేదన వ్యక్తం చేసిన కమెడియన్?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నిన్ను చూడాలని( Ninnu Chudalani ) అనే సినిమా ద్వారా వెండితెరకు కమెడియన్ గా పరిచయమయ్యారు కమెడియన్ రామచంద్ర(Ramachandra) .

ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ వెండితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈయన గత కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రామచంద్ర తను సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను తెలియజేశారు.ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ.

తాను కిందపడి కాలు ఫ్యాక్చర్ కావడం వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యానని అనంతరం కరోనా రావడం వల్ల తనకు ఇండస్ట్రీలో గ్యాప్ వచ్చిందని తెలిపారు.ఇక తన సినీ జీవితం గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని సినిమా కోసం ఆడిషన్ కి వెళ్ళగా ఎంపిక అయ్యానని తన మొదటి రెమ్యూనరేషన్(First Remuneration) 11000 రూపాయలని తెలియజేశారు.అనంతరం పరుగు సినిమాలు నా పాత్రకు డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎడిటింగ్ లో తీసేసారని తెలిపారు అలాగే గబ్బర్ సింగ్, సర్కారు వారి పాట, రామయ్య వస్తావయ్య వంటి సినిమాలో కూడా నేను నటించిన సన్నివేశాలను తొలగించారని కమెడియన్ రామచంద్ర వెల్లడించారు.

ఇలా వెండితెరపై సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సినిమాలలో నటిస్తూనే జబర్దస్త్ (Jabardasth)లో కూడా ట్రై చేశానని అయితే ఒకసారి చలాకి చంటి (Chalaki Chanti) టీం లో గెస్ట్ గా చేశానని ఈ సందర్భంగా రామచంద్ర తెలియజేశారు.తన జీవితంలో మోసపోయిన సందర్భం ఒకటి ఉందని ఈ సందర్భంగా తాను నష్టపోయిన విషయాన్ని కూడా బయట పెట్టారు.ఒక వ్యక్తిని నమ్మి బిజినెస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాను.

Advertisement

అయితే అందులో తాను మోసపోయానని, మోసపోయింది కాకుండా తిరిగి నేనే డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.కొంతమందిని నమ్మి సుమారు 60 లక్షల వరకు డబ్బు పోగొట్టుకున్నారంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు