Ali :అలీ ఫస్ట్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా.. ఆమె కోసమే ప్రేమను వదులుకున్నారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అలీ ( Ali ) ఒకరు.

ఈయన బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

అనంతరం కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు .అయితే ఇటీవల కాలంలో అలీ సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి.కేవలం కథ ప్రాధాన్యతో ఉన్నటువంటి సినిమాలలో కనిపిస్తున్నారే తప్ప పెద్దగా సినిమాలలో మాత్రం నటించలేదు కానీ బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు.

ఇక ఆలీ జుబేదా అనే మహిళను వివాహం చేసుకున్నారు.ఈయన తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు ప్రస్తుతం జుబేదా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాలను బయటపెట్టారు.

ఇకపోతే అలీ ఫస్ట్ లవ్ స్టోరీ( First Love story ) గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారితే అలీ తన లవ్ స్టోరీని ఆయన స్వయంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టారు.అలీ జుబేదాను పెళ్లి చేసుకోక ముందే ఒక అమ్మాయితో ప్రేమలో పడిపోయారట.

Advertisement

ఇలా ఆ అమ్మాయితో ప్రేమలో మునిగిపోయినటువంటి ఆలీ తనని పెళ్లి చేసుకోవాలని భావించారు కానీ తన తల్లి కారణంగా తన ప్రేమను వదులుకోవాల్సి వచ్చిందని ఈయన తెలిపారు.

అలీకి తన తల్లి అంటే చాలా ఇష్టం అయితే ఈయన తన తల్లికి తెలియకుండా తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడ్డారట ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు.ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం అలీ తల్లికి ఏమాత్రం ఇష్టం లేకపోవడంతోనే ఆయన తన ప్రేమను వదులుకోవాల్సి వచ్చిందట.ఇక ఆ అమ్మాయితో బ్రేకప్ జరిగిన తర్వాత కొద్ది రోజులకు తన తల్లి సూచనల మేరకు తాను జుబేదాను(Zubeda )పెళ్లి చేసుకున్నాను అంటూ ఈయన వెల్లడించారు.

ఇక జుబేదా అలీ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇటీవల తన పెద్ద కుమార్తెకు పెళ్లి కూడా చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇక సినిమాలకు దూరమైనటువంటి అలీ ప్రస్తుతం రాజకీయాలలో కూడా బిజీ అయ్యారు.

ఈయన వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలపడంతో జగన్మోహన్ రెడ్డి తనని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించిన సంగతి మనకు తెలిసిందే.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు