చ‌ర్మాన్ని స‌హ‌జంగా మెరిపించే కాఫీ స్క్ర‌బ్స్‌..ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

ఎలాంటి మేక‌ప్ వేసుకోక‌పోయినా చ‌ర్మం స‌హ‌జంగా మెరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అలాంటి చ‌ర్మం కోసమే ప్ర‌తి ఒక్క‌రు ఆర‌ట‌ప‌డుతుంటారు.

ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు.అయితే చ‌ర్మాన్ని స‌హ‌జంగా మెరిపించ‌డంలో ఇప్పుడు చెప్ప‌బోయే కాఫీ స్క్ర‌బ్స్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ కాఫీ స్క్ర‌బ్స్ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కాఫీ పౌడ‌ర్‌, రోజ్ వాట‌ర్ మ‌రియు షుగ‌ర్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మ‌రియు మెడ‌కు అప్లై చేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.ఆనంత‌రం కూల్ వాట‌ర్‌తో చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Advertisement
Coffee Scrubs For Glowing Skin! Coffee Scrubs, Glowing Skin, Skin Care, Scrubbin

ఇలా నాలుగు రోజుల‌కు ఒక సారి చేస్తే డెడ్ స్కిన్ సెల్స్‌ తొలిగిపోయి చ‌ర్మం స‌హ‌జంగా, అందంగా మెరుస్తుంది.

Coffee Scrubs For Glowing Skin Coffee Scrubs, Glowing Skin, Skin Care, Scrubbin

ఒక బౌల్‌లో ఒక స్పూన్ కాఫీ పొడి, రెండు స్లూన్ల కొబ్బ‌రి నూనె, అర స్పూన్ చ‌ప్పున‌ దాల్చిన చెక్క పొడి, బ్రౌన్ షుగ‌ర్ తీసుకుని బాగా క‌లుపు కోవాలి.ఇప్ప‌డు ఈ మిశ్రమాన్ని చ‌ర్మానికి అప్లై చేసి మూడు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేయాలి.అనంత‌రం కాస్త డ్రై అవ్వ‌నిచ్చి అప్పుడు చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంలో స‌హ‌జ‌మైన మెరుపు సంత‌రించుకుంటుంది.మ‌రియు మృదువుగా కూడా మారుతుంది.

ఇక ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ చ‌ప్పున కాఫీ పౌడ‌ర్‌, శెన‌గ‌పిండి మ‌రియు పెరుగు తీసుకుని బాగా క‌లిపి ముఖానికి ప‌ట్టించాలి.బాగా ఆరిన త‌ర్వాత త‌డి చేతుల‌తో మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి.

పిల్లలకు తీపి పదార్థాలు పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోయి.స్కిన్ గ్లోగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు