Viral: ఆన్‌లైన్‌ మార్కెట్లో కొబ్బరి పీచు ధరలు చూస్తే మీకు దిమ్మతిరుగుతుంది!

భారతీయులు అంటేనే కొబ్బరికాయ.కొబ్బరికాయ అంటేనే భారతీయులు.

అంతలా కొబ్బరికాయ అనేది మన దైనందిత జీవితంలో ఓ భాగం అయిపోయింది.ఇక దీనిని మనవాళ్ళు రకరకాలుగా ఉపయోగిస్తారు.

హిందూమతం ఆచార సంప్రదాయం ప్రకారం కొబ్బరికికాయకు చాలా ప్రత్యేక స్థానం ఉంది.దేవాలయానికి వెళ్లే ఏ ఒక్క భక్తుడు కొబ్బరికాయ తీసుకెళ్లకుండా ఉండరు అంటే అతిశయోక్తి లేదు.

ఇకపోతే కొబ్బరికాయ కొట్టడానికి ముందు కొబ్బరి పీచును మనం పక్కన పడేస్తాము.చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లో ఆ పీచును చెత్తకుప్పల్లో పడేస్తూ వుంటారు.

Advertisement

మహాకాకపోతే కొందరు గిన్నెలు తోమడానికి మాత్రమే వినియోగిస్తారు.అలాగే అరుదుగా కొబ్బరి పీచుతో తాళ్లు నేస్తారు.అంతకు మించి మనవాళ్ళు పెద్దగా దానిని వాడిన దాఖలాలు మనకు కనబడవు.

అయితే కొంతమంది వ్యాపారాలు మాత్రం రకరకాల అవసరాలుకు వాటిని ఉపయోగిస్తారు.మిగతావారు వాటిని పెద్దగా పట్టించుకోరనే చెప్పుకోవాలి.

అయితే కొన్ని మార్కెట్లో కొబ్బరి పీచుకు వున్న విలువ తెలిస్తే మీరు కళ్ళు తేలేస్తారు.ఈ కామర్స్ వెబ్‌సైట్, ఈ-కామర్స్ దిగ్గజం ప్లిప్‌కాట్ తన సైట్‌లో కొబ్బరి పీచును విక్రయానికి పెట్టింది.

అక్కడ అరకిలో కొబ్బరి పీచు ఏకంగా రూ.350లకు విక్రయిస్తోంది అంటే మీరు నమ్ముతారా? కాగా ఇది చూసిన జనాలు అవాక్కవుతున్నారు.కొబ్బరి పీచు కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చిందా? అని కొందరు షాక్ అవుతుంటే, అరెరే ఇన్నాళ్లు మేము వాటి విలువ తెలియక బయట పడేశాం! అని బాధ పడుతున్నారు.దాంతో కొందరు ఈ పీచు అమ్మకానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)

దాంతో అది కాస్తా వైరల్ గా మారింది.అన్నట్టు మీ దగ్గర కొబ్బరి పీచు ఎక్కువగా ఉంటే చెప్పండి.

Advertisement

తాజా వార్తలు