భూపాలపల్లి జిల్లాలో బొగ్గు లారీ దగ్ధం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ బొగ్గు లారీ మంటల్లో కాలిబూడిదైంది.కాటారం, మహదేవపూర్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Validation Check 2026
Advertisement