సీఎం పవన్ వర్సెస్ సీఎం ఎన్టీఆర్.. ఏంటీ కొత్త నినాదాలు..?

టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్‌‌తో పాటు జూ.ఎన్టీఆర్‌కు మాస్‌లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుంది.

వాళ్ల సినిమాలు విడుదలైన సమయంలో థియేటర్ల దగ్గర హడావిడి వాళ్ల ఫాలోయింగ్‌ను చాటి చెప్తుంది.అయితే కొన్ని ఫంక్షన్‌లలో అభిమానుల మధ్య పోటా పోటీ నెలకొంటుంది.

మా హీరో గొప్ప అంటే.కాదు మా హీరో గొప్ప అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటారు.

అలాంటి సందర్భాల్లో అభిమానులను కంట్రోల్ చేయడం దాదాపుగా అసాధ్యం.తాజాగా పశ్చిమగోదావరిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

Advertisement

పాలమూరు మహంకాళి జాతరలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అభిమానులు ఒకరికొకరు తలపడ్డారు.ఈ జాతరలో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.

ఈ నినాదాలను తట్టుకోలేని ఎన్టీఆర్ అభిమానులు సీఎం ఎన్టీఆర్ అంటూ పోటా పోటీగా నినాదాలు చేశారు.దీంతో వీళ్ల వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒక హీరో ఎమ్మెల్యే కూడా కాదు.మరొకరు అసలు రాజకీయాల్లో కూడా లేరు.

అయినా వాళ్లు సీఎం అవ్వడం ఏంటూ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

అసలు ఈ అభిమానులు దేని కోసం పోరాడుతున్నారంటూ నిలదీస్తున్నారు.పవిత్రమైన దేవుడి జాతరలో ఇలా వ్యక్తిగతంగా నినాదాలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని.

Advertisement

అప్పుడు సీఎం తమ నాయకుడే అని చాటిచెప్పాలని పవన్ అభిమానులు తాపత్రయపడుతున్నారు.

అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో లేకపోయినా టీడీపీకి భవిష్యత్ నాయకుడు తమ హీరోనే అంటూ ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.అందుకే పవన్ అభిమానులకు ధీటుగా ఎన్టీఆర్ అభిమానులు కూడా సీఎం అంటూ నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది.అయితే మహంకాళి జాతరలో ఇరువర్గాల అభిమానుల మధ్య వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి జోక్యం అభిమానులను చెదరగొట్టాల్సి వచ్చింది.

తాజా వార్తలు