గద్వాల్ సభలో ఏపీ పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

సీఎం కేసీఆర్( CM KCR ) జోగులాంబ గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ( BRS party ) కార్యాలయాన్ని, జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 కిలోమీటర్లు దూరం మాత్రమే.

కానీ ఆ రాష్ట్రానికి తెలంగాణకు తేడా గమనించాలని ప్రజలను సూచించారు.తెలంగాణ వస్తే చీకటమయం అవుతుందని విభజనకు ముందు ఎంతోమంది కామెంట్లు చేశారు.

కానీ కరెంటు విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో పరిస్థితి వేరు, మన రాష్ట్రంలో పరిస్థితి వేరు అని అన్నారు.

గతంలో పాలమూరు( Palamuru ) నుండి వలస వెళ్లేవారని ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుండి పాలమూరుకు వస్తున్న వారిని చూస్తున్నామని తెలిపారు.ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించని వారు ఇప్పుడు ధరణిని తీసేస్తామని అంటున్నారు అంటూ కేసిఆర్ సీరియస్ అయ్యారు.కానీ ధరణి కారణంగా రైతుబంధు నగదు నేరుగా బ్యాంకు ఖాతాలో పడుతుంది, 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయి అని వ్యాఖ్యానించారు.

Advertisement

ధరణి పై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.రాష్ట్రంలో ఇస్తున్న పథకాలు కొనసాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు కేసీఆర్ సూచన చేశారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement