ఢిల్లీ పయనంలో అంతరార్థం ఏంటి..?

ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి.ఆర్థిక కష్టాలు ఎక్కువ అయ్యాయి.

రాష్ట్రంలో కొత్త కొత్త పథకాలు తీసుకు వస్తుండటంతో.ఆర్థిక భారంగా పెరిగిపోయింది.

దాంతో ఏకంగా సీఎం జగన్ నెలకో, రెన్నెళ్లకో ఒక సారి.ఢిల్లీ భాట పట్టాల్సి వస్తోంది.

అయితే ఈ సారీ పెండింగ్ డబ్బుల కోసం కాకుండా.విభజన హామీలే ఎజండాగా హస్తినకు పయనమవుతున్నారు.

Advertisement

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.అటు టీడీపీ ఇటు జనసేనలు.

పోటా పోటీగా విమర్శలు ఎక్కు పెడుతున్నాయి.దాంతో విభజన హామీలు, కేంద్ర సంస్థల విభజన, రాష్టానికి కేంద్రం ఇచ్చిన హామీలతో పాటు, విభజన చట్టంలోని పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా లాంటి అంశాలపై సీఎం జగన్ కేంద్రాన్ని ఒత్తిడి చేయనున్నారు.

వైసీపీ విషయంలో.బీజేపీ పెద్దలకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండటంతో.

మహారాష్ట్రా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ లలో మాదిరి జగన్ పదవికి ఇప్పట్లో వచ్చిన గండం కూడా ఏమీ లేదు.అయితే ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!

ప్రత్యేక హోదా నినాదాన్ని తెర మీదకు తేవాలని.టీడీపీ, జనసేనలు ప్రయత్నిస్తున్నాయి.

Advertisement

రానున్న ఎన్నికల్లో అది బీజేపీ కి మైనస్ గా మారే అవకాశం ఉంది.చట్టం లో చెప్పక పోయినా.

సభ సాక్షిగా ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీకి అప్పట్లో బీజేపీ సైతం జై కొట్టింది.

ఏపీలో ఎన్నికలు వస్తే.బీజేపీ ప్రచారాస్త్రాలుగా మార్చుకోవడానికి ఏమీ లేకపోవడంతో.ఇప్పుడు వరాల జల్లు కురిపించాలని చూస్తోంది.

ఇదే అదునుగా సీఎం ఢిల్లీకి పయనమయినట్టు తెలుస్తోంది.బీజేపీ ముందుగా అనుకున్నట్టు, హామీలు కాకుండా పనులు అమలు చేస్తే.

వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తుంది.అందుకే ఢిల్లీలోని కేంద్ర మంత్రులతో పాటు ప్రధానిని కలిసి.

హామీల పత్రం పై సంతకాలు చేయించేకోవాలని చూస్తున్నారు.దాంతో ప్రతిపక్షాలు సతం ఆ ఊసు ఎత్తకుండా ఉండేందుకు వైసీపీ ప్లాన్ చేసింది.

కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే విభజన హామీల్లో ఆలస్యం చేసింది.అంతే కాక ఇటు కేసీఆర్ తిరుగు బాటు బావుటా ఎగుర వేయడంతో.

ఆయనకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ ను పక్కన పెట్టుకోవాలని చూస్తున్నారు.దాంతో ఈ సారి సీఎం జగన్ పర్యటన కొద్ది మేరకు సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది.

తాజా వార్తలు