తిరుపతికి సీఎం జగన్.. కాసేపట్లో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభం

ఏపీ సీఎం జగన్ తిరుపతికి చేరుకున్నారు.జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

ఇందులో భాగంగా మరి కాసేపటిలో తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం తరువాత ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ భవనాలకు శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.

తరువాత టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను సీఎం జగన్ అందించనున్నారు.అనంతరం తిరుమలకు వెళ్లనున్న సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

తరువాత పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు.కాగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్న సంగతి తెలిసిందే.

Advertisement

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇప్పటికే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు