కోడెల మృతిపై సీఎం జగన్‌ స్పందన

నవ్యాంధ్రప్రదేశ్‌ మొదటి స్పీకర్‌, ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు మంత్రిగా వ్యవహరించిన మాజీ మంత్రి వర్యులు కోడెల శివ ప్రసాద్‌ మృతిపై తెలుగు రాష్ట్రాల నాయకులు మరియు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోడెల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు.

కోడెల మృతిపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లుగా జగన్‌ పేర్కొన్నారు.డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు మృతికి తన సంతాపం తెలియజేశారు.

అలాగే కోడెల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి ట్విట్టర్‌ ద్వారా కోడెల మృతికి సంతాపం తెలియజేయడం జరిగింది.

మాజీ మంత్రి అయిన కోడెలను వైకాపా ప్రభుత్వం తీవ్రంగా క్షోభపెట్టడం వల్లే చనిపోయాడు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.మరి ఆ విషయమై వైకాపా ప్రభుత్వ ప్రతినిధులు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు