ఎస్సీ వర్గీకరణకు సీఎం జగన్ వ్యతిరేకం..: మాజీ మంత్రి జవహర్

ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి కేఎస్ జవహర్ తీవ్రంగా విమర్శలు చేశారు.ఎస్సీ వర్గీకరణకు సీఎం జగన్ వ్యతిరేకమని ఆయన ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు వచ్చినా సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని మాజీమంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు.మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్ కు రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీతోనే సామాజిక న్యాయం సాధ్యమని స్పష్టం చేశారు.అలాగే వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఎస్సీలు బుద్ధి చెప్తారని తెలిపారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు