చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ ఫైర్

నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.ఈ సందర్బంగా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రైతులను గాలికి వదిలేసిన చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ రైతు బాంధవుల వేషం వేసుకుని రోడ్డెక్కారని సీఎం జగన్ విమర్శించారు.సున్నా వడ్డీ పథకం రద్దు చేసి ఐదేళ్లలో రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.

చంద్రాబు స్క్రిప్ట్ ప్రకారం పొలిటికల్ యాక్షన్ చేస్తూ ప్యాకేజీలు తీసుకొనే ప్యాకేజీ స్టార్ మరో పక్క హడావుడి చేస్తున్నారని విమర్శించారు.వీళ్ల డ్రామాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని సూచించారు.

తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

Advertisement
Lorem Ipsum Dolor Sit Amet