Shinganamala : శింగనమల అభ్యర్థిపై చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ కౌంటర్లు..!!

"మేమంతా సిద్ధం" బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది.

ఈ క్రమంలో ఎమ్మిగనూరులో సాయంత్రం జరిగిన సభలో సీఎం జగన్( CM Jagan ) ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రధానంగా శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు( YCP candidate Veeranjaneyulu ) టిప్పర్ డ్రైవర్ అని వైయస్ జగన్ తెలియజేశారు.అయితే తాను టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇచ్చానంటూ చంద్రబాబు తూలనాడాడని హేళన చేశారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు.

‘అవునయ్యా.చంద్రబాబు.

మేం పేదవాళ్లకు టికెట్లు ఇచ్చాం.ఆ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు MA ఎకనామిక్స్, ఆపై బీఈడీ చదివాడు.

Advertisement

చంద్రబాబు( Chandrababu ) హయాంలో ఉద్యోగాలు రాక డ్రైవర్ అయ్యారు.మడకశిరలోనూ ఉపాధి హామీ కూలీ లక్కప్పకు టికెట్ ఇచ్చామని గర్వంగా చెప్తా’ అని అన్నారు.పేదలంటే చంద్రబాబుకి అలుసు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.175 నియోజకవర్గాలలో తాను 100 మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు టికెట్లు ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు.శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు వైసీపీ పార్టీ కార్యకర్తలని అన్నారు.

కొన్నాళ్ల నుంచి వైసీపీ జెండాను మోసిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు.అందుకే పేదవాడు అని చూడకుండా తాను టికెట్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు.

జగన్ పేదల పక్షపాతి అని అనటానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని వ్యాఖ్యానించారు.రాజకీయాలలో రాణించాలంటే పేద ధనిక అనే బేధం ఉండకూడదని సేవ చేయాలి అని తపన ఉన్నవారు రావచ్చని స్పష్టం చేశారు.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు