బీజేపీ వ్యుహాల కి..దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వనున్న..బాబు

ఏపీలో సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని బీజేపీ ప్రభుత్వం తన వ్యుహాలకి పదును పెడుతోంది.

కేంద్ర ప్రభుత్వ సాయంతో అమలు అవుతున్న పధకాలు ఆన్నిటిని టీడీపీ తన పదకాలుగా చెప్పుకోవడం వాటిని టీడీపీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటోంది అంటూ బీజేపీ తెగ హైరానా పడుతోంది అయితే బాబు చేస్తున్న ఈ ప్రయత్నాలకి గండి కొట్టడానికి బీజేపీ నేతలు అందుకు తగ్గట్టుగానే ఒక వ్యూహాన్ని రచించారు.

అందులో భాగంగానే.కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారు.

ఏపీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న పధకాలు అని చెప్పుకుంటున్న కేంద్ర పధకాలకి సంభందించిన కేంద్రం మంత్రులు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారు.ఈ పధకాలు బీజేపీ చేస్తున్నావే అని చెప్పడానికే ఈ రకమైన పర్యటనలని షా చేయిస్తున్నారని తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పటికే ఏపీలో ప్రజలు బాబు కేంద్ర పధకాలు అన్నిటిని చంద్రబాబు ఏర్పాటు చేసి ప్రజలకి అందిస్తున్నారు అనే ఆలోచనలో ఉన్నారు దాంతో కేంద్రానికి పధకాల ఫలితం దక్కడం లేదు

అందుకే ఆయా శాఖల మంత్రులను రాష్ట్రంలో పర్యటించేలా చేసి తద్వారా పధకాలపై బీజేపీ ముద్ర ఉంటుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు.అయితే బీజేపీ వ్యూహానికి చంద్రబాబు కూడా కౌంటర్ సిద్దం చేసి ఉంచారు అదేంటంటే.పోలవరం విషయంలో అంతా మేమే చేశామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు కానీ నిధులు ఇచ్చింది చేసొంది మేము పోలవరం పనులు ఇక్కడి వరకూ వచ్చాయి అంటే దానికి మోడీ నే కారణం అంటూ మొన్న ఏపీ కి వచ్చిన గడ్కరీ చెప్పకనే చెప్పారు.

Advertisement

ఇదిలాఉంటే మరో పక్క, ఈనెల 13వ తేదీన మంగళగిరికి సమీపంలో నిర్మిస్తున్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ ఆసుపత్రి నిర్మాణ పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపీ నడ్డా కూడా వచ్చారు.ఎపీకి హామీల వర్షం కురిపించారు దాంతో బీజేపీ ప్లాన్ అర్థం చేసుకున్న బాబు.

అప్రమత్తమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు అత్యంత విలువైన సుమారు వంద ఎకరాల స్థలం ఇచ్చిన విషయం నీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్న అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.అలాగే, పోలవరం గురించి, ఇప్పటికే కేంద్రం అడుగడుగునా ఎలా కొర్రీలు పెడుతుంది ప్రజలకు చెప్తున్నారు.

మరో పక్క కేంద్ర విద్యా సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖరీదైన భూములు ఇచ్చిందని .ప్రహరీలు కట్టిందని , మౌలిక సదుపాయలు ఇచ్చిందని చెప్పి.కేంద్రం వీటికి ఇప్పటికి ఎన్ని డబ్బులు ఇచ్చింది, ఇవి పుర్తవ్వాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో ప్రజలకు వివరించనున్నారు.

అలాగే.కేంద్రం మనకు వేసే బిక్ష ఏమి ఉండదు అని, రాష్ట్రాలు ఇచ్చిన డబ్బులే.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

కేంద్రం తిరిగి రాష్ట్రాలుకు ఇస్తుందనే విషయం బీజేపీ మర్చిపోతోందని ఈ విషయం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు.ఈ విధంగా కేంద్రం వేసిన స్కెచ్ కి బాబు దిమ్మతిరిగే జవాబు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు