శనివారం బూజు దులిపి లక్ష్మీదేవికి లవంగం సమర్పిస్తే..!

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటారు.ఆ విధంగా జీవితంలో సుఖశాంతులు ఉండాలనే నిరంతరం కృషి చేస్తుంటారు.

రాత్రి పగలు ఎంత కష్టపడినప్పటికీ చేతిలో డబ్బు నిల్వకాకుండా కొందరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలగాలంటే శనివారం ఈ విధంగా చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

శనివారం ఏ విధంగా చేస్తే ధనప్రాప్తి కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.మనకు ధన ప్రాప్తి కలగాలంటే ముందుగా మన ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడాలి.

ఈ విధంగా మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలంటే ప్రతి శనివారం ఇంట్లో బూజు దులపాలి.అంతేకాకుండా విరిగిపోయిన లేదా పగిలిపోయిన వస్తువులు ఏవైనా మన ఇంట్లో ఉంటే వాటిని శనివారం పూట కచ్చితంగా బయట పడేయాలి.

Advertisement
Clove Is Offered To Lakshmi Devi On Saturday, Clove, Offered To Lakshmi Devi, S

ఈ విధంగా శనివారం బయట పడేయడం ద్వారా మన ఇంట్లో ఉన్న ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి.అదే విధంగా మనకు ధన ప్రాప్తి కలగాలంటే అమ్మవారికి ఉపవాసం చేస్తూ శుక్రవారం ఒక లవంగాన్ని సమర్పించడం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది.

Clove Is Offered To Lakshmi Devi On Saturday, Clove, Offered To Lakshmi Devi, S

మన ఇంట్లో ఎల్లప్పుడూ అనుకూల వాతావరణం కలిగి ఉండాలంటే గృహిణిలు ఎప్పుడూ కూడా కంటతడి పెట్టకూడదు.శుక్రవారం, శనివారం అమ్మవారికి శ్రీ సూక్తం తప్పనిసరి.అంతేకాకుండా పూజగదిలో ఎల్లప్పుడు ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం ద్వారా ధనప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

అదే విధంగా మన ఇంట్లో డబ్బు పొదుపు చేయాలనుకుంటే భరణి నక్షత్రం నుంచి మొదలు పెట్టడం మంచిది.అదే విధంగా డబ్బు నిల్వ ఉంచిన చోట కొన్ని అక్షింతలు, నాలుగు లక్ష్మీ గవ్వలు, నాలుగు సురీడి కాయలు, నాలుగు ఆకుపచ్చ గాజులు పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడుపుతారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Glowing skin : ఒక్క రాత్రిలో గ్లోయింగ్ స్కిన్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు