ఎస్పీ బాలు తో గొడవ.. కే విశ్వనాథ్ నటుడిగా పరిచయం

కళను మాత్రమే నమ్ముకొని దాన్నే కథా వస్తువుగా చేసుకొని కళాతపస్వికా అనేక సినిమాలకు ప్రాణం పోశారు కే విశ్వనాధ్ గారు.

ఆయన దర్శకుడిగా కెరియర్ మొత్తం మీద 50 సినిమాలు తీశారు.

అయితే జరిగిన ఒక గొడవ అతడిని నటుడిని చేసింది.బాలసుబ్రమణ్యం కమలహాసన్ సంయుక్త నిర్మాణంలో శుభసంకల్పం అనే సినిమా తీశారు.

దీనికి విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమాకు అందరి పాత్రలను సెలెక్ట్ చేసిన విశ్వనాథ్ గారికి గంభీరంగా ఉండే ఒక పెద్ద మనిషి పాత్ర కోసం సరైన పాత్రధారి దొరకలేదు.

మొదట శివాజీ గణేషన్ తో ఆ పాత్ర చేయించాలని విశ్వనాధ్ గారు భావించిన ఏవో కొన్ని కారణాల చేత అది కార్యరూపం దాల్చలేదు.అయితే ఆ బాధ్యతను విశ్వనాథ్ గారు బాలసుబ్రమణ్యం నెత్తిన పెట్టారు.ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా సరైన వ్యక్తిని ఎంచుకోలేక పోయారు బాలు.

Advertisement

దాంతో కోపానికి వచ్చిన విశ్వనాథ్ గారు ఆ పాత్ర కోసం క్యారెక్టర్ నీ నిర్ణయిస్తావా లేదా అంటూ బాలసుబ్రమణ్యం పై పైరయ్యారట.అయితే నేను పాత్ర కోసం నటుడుని చూసాను అని బాలసుబ్రమణ్యం చెప్పారట.

మరి ఆ నటుడు ఎవరో నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటూ అడిగారట విశ్వనాథ్ గారు.

దాంతో ఈ సినిమాలో ఆ పాత్ర కోసం మీరే నటిస్తున్నాడు అని చెప్పారట బాలు.నీకేమైనా పిచ్చి పట్టిందా నేను దర్శకత్వం వహిస్తున్న సమయంలో నాకు పక్కన ఏ విషయాలు తెలీదు నేను ఎలా నటించగలను అంటూ బాలు పై గొడవకు దిగారట.నువ్వు నటిస్తే ఓకే, లేదంటే ఈ సినిమా ఇక్కడతో ఆపేద్దాం అని చెప్పి కోపంగా వెళ్ళిపోయారట బాలు.

అలా మొదటిసారి శుభసంకల్పం సినిమా కోసం బాలు నటించడం మొదలుపెట్టారు ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు.బాలు చేసిన మంచి పని వల్ల శుభ సంకల్పం మరియు కలిసుందాం రా సినిమాలకు విశ్వనాథ్ గారికి నంది అవార్డులు దక్కాయి.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు