యూఎస్ లో మైండ్ బ్లాంక్ చేస్తున్న 'వాల్తేరు వీరయ్య'.. ఇదేం రచ్చరా నాయన!

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ల తర్వాత తన స్టామినా బయటకు తీసాడు.

తన కెరీర్ లో యంగ్ఏజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసాడో ఇప్పుడు కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాడు.

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య.ఇక ఈ సినిమాతో మెగాస్టార్ చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

సరైన మాస్ సినిమా సరైన సమయంలో రిలీజ్ చేస్తే ఇప్పటికి మెగాస్టార్ స్టామినా ఎంత మాత్రం తగ్గలేదు అని నిరూపిస్తున్నాడు.జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినా వాల్తేరు వీరయ్య సినిమా మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది అనే చెప్పాలి.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ ను సైతం మెప్పించింది.శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.ఈ సినిమా సంక్రాంతి పండుగ రోజుల్లో మాత్రమే కాదు.

Advertisement

సెలవలు ముగిసిన తర్వాత కూడా మంచి కలెక్షన్స్ రాబడుతు దూసుకు పోతుంది.ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో మాసివ్ వసూళ్లు నమోదు చేస్తూ రికార్డులను బ్రేక్ చేస్తుంది.

మెగాస్టార్ కెరీర్ లో మరొక ఫాస్టెస్ట్ రికార్డులు సెట్ చేసిన ఈ సినిమా అక్కడ 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.ఈ మార్క్ కొడుతోంది అని ముందు నుండి ట్రేడ్ పండితులు చెబుతూనే ఉన్నారు.అనుకున్న విధంగానే ఈసారి మెగాస్టార్ గట్టిగ కొట్టాడు.6 రోజుల్లోనే ఈ మార్క్ టచ్ చేసి మైండ్ బ్లాంక్ చేసేస్తుంది.ఇంకా బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా వసూళ్లు రాబడుతూ అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు