తోడుదొంగ‌ల‌కు చిరు జ‌త క‌ట్టాడు...

ప్రతి ప‌క్ష నేత జగన్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తోడుదొంగల్లా మారార‌ని, రైళ్ల‌ను త‌గ‌లెట్టిన వారిని అరెస్టు చేయ‌ద్దంటూ దౌర్జ‌న్య‌కారుల‌కు వంత పాడుతున్నార‌ని, వీరి చిరంజీవి జ‌త క‌ల‌వ‌టం హేయ‌మ‌ని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

ముద్రగడ దీక్షపై ఆయన శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

అన్ని విధాలా తాము అధికారంలో ఉన్న్నాళ్లు .కాపులను అణ‌గ‌దొక్కిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీద‌ని, దానికి వారస‌త్వం పుణికి పుచ్చుకున్న పిల్ల కాం్ర‌గెస్ , వైసీపీలోనూ కాపుల‌కు ప్రాధాన్య‌త లేద‌ని, అలాంట‌ప్పుడు కాపుస‌మ‌స్య‌ల‌పై మాట్లాడే అర్హ‌త వారికెక్క‌డిద‌ని ఆయన మండిపడ్డారు కాపుల కోసం ్ర‌ప‌జా రాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి అర్దంత‌రంగా దాన్ని ఎందుకు మూసేసారో, స్వ‌లాభం కోసం ఆయ‌న ఎంత‌కైనా దిగ‌జారుతార‌ని ఘాటుగా విమ‌ర్శిస్తూ, ఇప్పటివరకు కాపు సమస్యలపై కేం్ర‌ధ ప్ర‌భుత్వంతో ఎప్పుడైనా మాట్లాడారా? , అవెంటో వెల్ల‌డించేందుకు సిద్ధ‌మా? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ప్రశాంతతకు భంగం కలిగించేవారిని చిరంజీవి ఎందుకు ప్రోత్సహిస్తున్నారని నిల‌దీసారాయ‌న‌ ముద్రగడను ఆస్పత్రికి తరలించే సమయంలో పోలీసులు ప్ర‌వ‌ర్త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై చర్యలు తీసుకోవాలని ఇప్ప‌టికే డీజీని కోరామని బోండా ఉమా తెలిపారు.

How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు