'గాడ్ ఫాదర్' మేకర్స్ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు!

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ గాడ్ ఫాదర్ అనే పొలిటికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

ఇక ఇటీవలే ఊటీ లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.అయితే తాజాగా ఈ సినిమా విషయంలో ఒక రూమర్ బాగా వినిపిస్తుంది.

ఈ సినిమాలో చెల్లెలి పాత్ర కీలకం అనే విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమా మలయాళ వర్షన్ లో చెల్లెలి పాత్రలో మంజు వారియర్ నటించింది.

Advertisement
Chiranjeevi Godfather Movie Team Make Such A Decision, God Godfather Latest Upda

కానీ తెలుగులో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం ఎవ్వరు దొరకడం లేదు.చెల్లెలి రోల్ కోసం నయనతార తో ఎప్పటి నుండో చర్చలు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

కానీ నయనతార ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోల్ కోసం ఒప్పుకోవడం లేదని టాక్.

Chiranjeevi Godfather Movie Team Make Such A Decision, God Godfather Latest Upda

ఇక ఇప్పటికే ఈ షూటింగ్ కూడా స్టార్ట్ కావడంతో చెల్లెలి రోల్ కోసం ఇప్పటికిప్పుడు ఆ పాత్రకు సరిపోయే నటిని తీసుకు రావాలంటే మేకర్స్ కు కూడా కష్టమైన పనే.అందుకే మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చారట.ఈ సినిమాలో చెల్లెలి ట్రాక్ ను మొత్తానికే తీసేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Chiranjeevi Godfather Movie Team Make Such A Decision, God Godfather Latest Upda

ఈ ట్రాక్ ను మొత్తం తీసేసి మళ్ళీ కథను తిరిగి రాసారని రూమర్స్ వినిపిస్తున్నాయి.ఇక మరోవైపు చెల్లెలి పాత్రకు సంబంధించిన సీన్స్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టి మిగతా షూట్ పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.ఆ తర్వాతనే చెల్లెలి పాత్రను ఏం చేయాలో ఆలోచిస్తారని తెలుస్తుంది.

మొత్తానికి చిరంజీవి చెల్లెలి పాత్ర మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

Advertisement

తాజా వార్తలు