ఆ విషయంలో చరణ్ నాకు అన్యాయం చేశాడు... ఆ క్షణాలు జీవితంలో మర్చిపోలేను: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన చిత్రం ఆచార్య.

ఈ సినిమా ఏప్రిల్ 29 వ తేదీ విడుదల కానుంది.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇక తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో భాగంగా చిత్ర బృందం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆశక్తికరమైన సమాధానాలు చెప్పారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ నుంచి మీరేం నేర్చుకున్నారు అని ఒక విలేకరి ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మెగాస్టార్ ఎంతో ఆసక్తికరమైన సమాధానం వెల్లడించారు.సాధారణంగా ఏ హీరో అయినా తన షాట్ అయిపోగానే షాట్ చాలా అద్భుతంగా వచ్చింది, యాక్టింగ్ చించేసాను అని చెప్పుకుంటారు.

Advertisement

కానీ చరణ్ మాత్రం అలా కాదు షార్ట్ పూర్తి అయిన తరువాత డైరెక్టర్ ఓకే అనగానే చరణ్ సంతోషించడం నాకు చాలా బాగా నచ్చింది.అదేవిధంగా లొకేషన్లో ఉన్న సమయంలో కేరవాన్ లో భోజనం చేసే అలవాటు నాకు లేదు అలా సెట్ లో అందరితో కలిసి భోజనం చేసే అలవాటు నాకు ఉంది.

అదే అలవాటు చరణ్ లో కూడా ఉంది అంటూ చరణ్ గురించి చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇలా చరణ్ తో కలిసి ఆచార్య షూటింగ్ లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన మెగాస్టార్ ఒక విషయంలో మాత్రం తనకు తీవ్ర అన్యాయం చేశారని వెల్లడించారు.సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేని ప్రాంతంలో 20 రోజుల పాటు నేను చరణ్ ఓకే కాటేజ్ లో ఉండి సినిమా షూటింగ్ లో పాల్గొన్నాము.ఇలా ఆ అందమైన ప్రదేశానికి తన భార్య సురేఖను కూడా వెంట తీసుకు వెళ్దామని చెప్పగా రామ్ చరణ్ సురేఖను తీసుకు వెళ్ళకుండా అడ్డుకున్నారు.

ఇలా ఈ విషయంలో రామ్ చరణ్ తనకు తీవ్ర అన్యాయం చేశాడని మెగాస్టార్ తెలిపారు.ఇకపోతే 20 రోజులపాటు ప్రతి క్షణం తన కొడుకు కలసి గడపడం ఎంతో ఆనందంగా ఉందని ఆ క్షణాలు జీవితంలో మర్చిపోలేనివని చిరంజీవి ఈ సందర్భంగా వెల్లడించారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement