సంక్రాంతి సినిమాలపై ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్న చిరు, బాలయ్య.. మరి విన్నర్ ఎవరో?

ఈసారి సంక్రాంతి కానుకగా దుమ్ములేచిపోయే సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

ప్రతీ ఏడాది లాగా ఈసారి స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడబోతున్నారు.

మరి అందులో ఒకరు నందమూరి బాలకృష్ణ కాగా.మరొకరు మెగాస్టార్ చిరంజీవి.

దీంతో ఈ ఇద్దరి స్టార్ హీరోల మధ్య తీవ్ర పోటీ ఎదురవుతుంది.మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్న నేపథ్యంలో ఈ పోటీ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారిపోయింది.

ఈ ఇద్దరు హీరోలు కూడా తమ సినిమాలపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.బాబీ దర్శకత్వంలో చిరు వాల్తేరు వీరయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నారు.

Advertisement

వీరసింహారెడ్డి జనవరి 12న, వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ కాబోతున్నాయి.ఇప్పటికే ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా గ్రాండ్ గా ముగిసాయి.ట్రైలర్స్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి ఆసక్తి రేపాయి.

దీంతో ఈ ఇద్దరు హీరోలు ఏమాత్రం తగ్గకుండా తమ సినిమాలపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ రెండు సినిమాలకు బాగా జరుగుతున్నాయి.ఇక ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ నే నిర్మించింది.అలాగే ఈ రెండు సినిమాల్లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్ గా నటిస్తుంది.

ఒక్కరోజు తేడాతో ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.చూడాలి ఈ ఏడాది ఎవరు విన్ అవుతారో.

ఆరోగ్యంగా లేమని చెప్పటానికి సూచనలు..
Advertisement

తాజా వార్తలు