చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు చిరంజీవి.( Chiranjeevi ) తెలుగులో వందల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అంతేకాకుండా ఎన్నో రకాల అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు.ఇక మెగాస్టార్ చిరంజీవి బాటలోనే ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రయాణించిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్‌ సైతం అదే స్థాయిలో అభిమానులను సంపాదించారు.చిరంజీవి తమ్ముడిగానే కాకుండా పవర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అంతేకాదు ఈ రోజు ఏపీలో డిప్యూటీ సీఎం స్దాయికి ఎదిగారు.

Advertisement

తను స్దాపించిన జనసేన పార్టీని( Janasena Party ) నిలబడిన ప్రతీ చోటా ఒంటిచేత్తో గెలిపించుకున్నారు.అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అనిపించుకున్నారు.చిరంజీవికి, పవన్ కు ఉన్న అనుబంధం విషయానికి రామ,లక్ష్మణులే గుర్తుకు వస్తారు అందరికీ.

చిరంజీవి మీద చిన్న మాట పడనివ్వరు పవన్ కళ్యాణ్.ఇక పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తూంటారు చిరంజీవి.

పవన్ గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవి కళ్ళలో ప్రత్యేకమైన ప్రేమ, ఆర్ద్రత కనపడుతూ ఉంటాయి.రామ్ చరణ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎలాగైతే ఆ కళ్లల్లో మెరుపు కనిపిస్తుందే అదే విధంగా పవన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు జరుగుతుందని చూసిన వాళ్లు చెప్తూంటారు.

అలాగే నాగబాబు( Nagababu ) ఉన్నా కూడా పవన్ విషయమే ఎక్కువగా చెప్తూంటారు చిరంజీవి.అయితే ఇదే విషయాన్ని ఒక షోలో చిరంజీవినే ఎందుకు మీకు నాగబాబు కూడా సోదరుడే అయినా పవన్ పై ప్రత్యేకమైన ప్రేమ అని అడగగా, దానికి చిరంజీవి స్పందిస్తూ.నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా చిన్నోడు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

మా పెళ్లినాటికి కూడా వాడు నాలుగో,ఐదో చదువుతున్నాడు.ఆ వయస్సులో వాడు మా దగ్గర ఎక్కువ ఉండేవాడు.

Advertisement

మా దగ్గర చదువుకున్నాడు.మద్రాస్ లో కొన్నాళ్లు మా ఇంట్లోనే ఉన్నాడు.

తర్వాత నెల్లూరు వెళ్లాడు.అదేంటో మా ఇంట్లో బిడ్డలాగ అనిపిస్తుంది.

మా మొదటి బిడ్డలాగ ఉంటాడు అని తెలిపారు చిరంజీవి.ముఖ్యంగా ఏంటంటే నేను , నాగబాబు, కొంతకాలం వరకూ మా మొదటి చెల్లి కలిసే ఉన్నాము.

అయితే మిగతా ఇద్దరూ మాధవి, కళ్యాణ్ పుట్టే సమయానికి నేను వేరే చోట చదువుకుంటూ ఉన్నాను.వీళ్లను హాలిడేస్ లో చూడటం తప్పించి ఎప్పుడు చూడలేదు.

నేను వీళ్లని బాగా మిస్సైన ఫీలింగ్ నాకు.అందుకే నాకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం అని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు