నందమూరి వారసుడు, హీరో తారకరత్న (Tarakaratna) ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే.
గుండెపోటుకి గురైనటువంటి తారకరత్న దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈ విధంగా తారకరత్న మరణించి ఐదు నెలలు అయినప్పటికీ తన భర్త మరణ వార్త నుంచి తన భార్య పిల్లలు ఇంకా బయటపడలేదనే తెలుస్తుంది.ఈ క్రమంలోని అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) తరచూ తన భర్తతో ఉన్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు అందరికి కంటతడిని పెట్టిస్తున్నాయి.
ఇక తారకరత్న అలేఖ్య రెడ్డి ఇద్దరు కూడా ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు అయితే పెళ్లి చేసుకుని కుటుంబం నుంచి బయటకు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడినటువంటి తారకరత్న తన జీవితం కాస్త కుదుటపడిందనే లోపు మరణించారు.ఈ విధంగా తారకరత్న మరణించడంతో తన భార్య పిల్లలు ఒంటరిగా గడుపుతూ తరచూ తనని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఫాదర్స్ డే (Fathers Day)సందర్భంగా తన పిల్లలు తన తండ్రిని ఎంతో మిస్ అవుతున్నారంటూ అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి తారకరత్న చిత్రపటం ముందు తన ముగ్గురు పిల్లలు ఫాదర్స్ డే సందర్భంగా పువ్వులను వేసి తన తండ్రికి నమస్కరిస్తున్నటువంటి ఫోటోనే ఆలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇక ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె పిల్లలు నిన్ను చాలా మిస్ అవుతున్నారు నాన్న.వారి బాధ ముందు నా బాధ చాలా చిన్నది.
మన పిల్లల దృష్టిలో అత్యుత్తమ తండ్రిగా ఉన్న నీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు.వి లవ్ యు ఓబు అంటూ ఈమె తన భర్తను తలుచుకుంటూ చేసినటువంటి ఈ పోస్ట్ అందరిని కంటతడి పెట్టేలా చేస్తుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy