పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న చీకోటి ప్రవీణ్..!!

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు తెలంగాణ బీజేపీలోకి ఆయన వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లిన చీకోటి ప్రవీణ్ బీజేపీ నాయకులను కలుస్తున్నారని తెలుస్తోంది.ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ఆయన కలిశారు.

జాతీయ నేతల సమక్షంలో చీకోటి కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జోరుగా సాగుతోంది.పార్టీలో చేరతానన్న చీకోటి హిందూత్వం కోసం పని చేస్తానని చెప్పినట్లు సమాచారం.

దీనిపై స్పందించిన డీకే అరుణ చీకోటి వ్యవహారంపై పార్టీ అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players