ఈనెల 12న బీజేపీలోకి చీకోటి ప్రవీణ్ చేరిక..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ బీజేపీ గూటికి చేరనున్నారన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఆయన తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు.ఈ మేరకు ఈనెల 12 వ తేదీన చీకోటీ కమలతీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి నేతృత్వంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.కాగా చీకోటి ప్రవీణ్ చేరిక నేపథ్యంలో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో జాయిన్ అయిన తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీకోటి పోటీ చేస్తారని తెలుస్తోంది.హైదరాబాద్ లోని ఏదైనా ఓ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం.

Advertisement