చికాగో పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న క్రిస్టియన్ విద్యార్థి మరియా గ్రీన్( Mariyah Green ) ఒక కేసులో గెలిచి భారీ పరిహారం అందుకుంది.
స్కూల్‌లో మెడిటేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా బలవంతంగా విగ్రహారాధనలో( Idol Worship ) పాల్గొనాల్సి వచ్చిందని ఆమె ఆరోపించింది.
అంతేకాదు, స్కూల్ డిస్ట్రిక్ట్‌కి వ్యతిరేకంగా దావా వేసి 1,50,000 డాలర్ల నష్టపరిహారం పొందింది.స్కూల్ క్యాంపస్‌లో "క్వైట్ టైమ్"లో( Quiet Time ) ఒక విదేశీ దేవత ప్రతిమకు నమస్కరించాలని ఒక ఫిమేల్ మెడిటేషన్ టీచర్ తనను కోరినప్పుడు తాను అసౌకర్యంగా ఫీలయ్యానని గ్రీన్ ఫాక్స్ చెప్పింది.
ఇలా చేస్తే "జెన్"కి దగ్గరవ్వడానికి ( Zen ) సహాయపడుతుందని టీచర్ తనను ఒప్పించడానికి ప్రయత్నించినట్లు ఆమె ఆరోపించింది.చర్చిలో దేవుడిని ప్రార్థించినప్పుడు మాత్రమే మోకరిల్లుతానని, విగ్రహానికి నమస్కరించడం తన విశ్వాసానికి తగదని గ్రీన్ ఎంత చెప్పినా ఆ టీచర్( Teacher ) వినలేదట.
కొన్ని మంత్రాలు కూడా ఆమె చేత చదివించిందట.ఆ మంత్రాలపై కొంత పరిశోధన చేసినప్పుడు అవి హిందూ దేవుళ్లకు సంబంధించినవని తాను గుర్తించినట్లు స్టూడెంట్ తెలిపింది.
ఫిబ్రవరిలో న్యాయ సంస్థ మాక్ అండ్ బేకర్( Mauck and Baker ) దాఖలు చేసిన దావా ప్రకారం, చికాగో పబ్లిక్ స్కూల్స్‌లోని( Chicago Public School ) "క్వైట్ టైమ్" ప్రోగ్రామ్ ప్రాథమిక మతపరమైన స్వభావం, గ్రీన్ మత విశ్వాసాలను ఉల్లంఘించింది.పూజా కార్యక్రమానికి హాజరు కావాలని గ్రీన్‌ను కోరారని, అక్కడ ఆమె గురువు చిత్రపటానికి నమస్కరించాల్సి వచ్చిందని దావా ఆరోపించింది.
మంత్రాలను ఇతరులతో పంచుకుంటే వాటి ప్రభావం పోతుందని, వాటిని గోప్యంగా ఉంచాలని విద్యార్థులకు చెప్పారని వ్యాజ్యం తెలిపింది.స్కూల్‌లో ఏం జరుగుతుందో ఆ సమయంలో తన పాస్టర్‌గా ఉన్న తన తల్లితండ్రులకు, అత్తకు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు గ్రీన్ చెప్పింది.స్కూల్ డిస్ట్రిక్ట్ కేసును పరిష్కరించడానికి, గ్రీన్ కు $150,000 చెల్లించడానికి అంగీకరించిందని న్యాయ సంస్థ తెలిపింది.
అలాగే ఇలాంటి విగ్రహారాధన బలవంతపు చర్యలు భవిష్యత్తులో రిపీట్ కావని కూడా హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy