చిత్తూరు జిల్లా వి.కోటలో చిరుత సంచారం

చిత్తూరు జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.వి కోటలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.

ఈ క్రమంలోనే నక్కనపల్లిలో చిరుత ఓ కుక్కను వేటాడింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

బయటకు రావాలంటేనే జంకుతున్నారు.అనంతరం చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.చిరుతపులి పాదముద్రలను గుర్తించే పనిలో పడ్డారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide