మహబూబ్‎నగర్‎లో చెడ్డీ గ్యాంగ్ హల్‎చల్

మహబూబ్‎నగర్‎ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేయడంతో తీవ్ర కలకలం చెలరేగింది.జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో ఈ ముఠా వరుస దొంగతనాలకు పాల్పడ్డారు.

ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన గ్యాంగ్ భారీగా నగదు, బంగారాన్ని అపహరించుకొని వెళ్లారు.మరోసారి అదే కాలనీలో చోరీకి చెడ్డీ గ్యాంగ్ విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది.

సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీ టీపీ పుటేజీ ఆధారంగా గ్యాంగ్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు