షాకింగ్: మెడికల్ ఎగ్జామ్‌లో కూడా పాసైన చాట్‌జీపీటీ... మనుషుల కంటే బెస్ట్‌ స్కోర్‌ చేసిందట?

సాంకేతిక ప్రపంచంలో చాట్‌జీపీటీ ( ChatGPT ) పెను సంచలనాలు సృష్టిస్తూ ప్రత్యర్థి కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఈ క్రమంలో తన సామర్థ్యాలను అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది.

ఏఐ చాట్‌బాట్( AI Chatbot ) రోజురోజుకీ మరింత శక్తివంతంగా మారుతుండడంతో ఇది ఉద్యోగులను కూడా భర్తీ చేస్తుందనే భయం ఈమధ్యకాలంలో రెట్టింపు అవుతోంది.ఇక లేటెస్ట్ వెర్షన్ చాట్‌జీపీటీ-4 న్యూరో సర్జరీ పరీక్షలో( Neuro Surgery Exam ) మానవుల కంటే మెరుగైన స్కోరు సాధించి ఆరోగ్య నిపుణులను అవాక్కయేలా చేసింది.

అమెరికన్ బోర్డ్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జరీ మాక్ ఎగ్జామ్‌ క్వశ్చన్ పేపర్‌ ఒకదానిని క్రియేట్ చేసారు.ఆ పరీక్షలో ఈ ఏఐ చాట్‌బాట్ ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇచ్చి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.చాట్‌జీపీటీ తాజా వెర్షన్ మెరుగ్గా సమాధానాలు రాయగా.

ఇది మానవ నిపుణులను భర్తీ చేయగలదనే ఆందోళనలను ఇపుడు కలిగిస్తోంది."పర్ఫామెన్స్ ఆఫ్ చాట్‌జీపీటీ అండ్ జీపీటీ-4 ఆన్ న్యూరోసర్జరీ రిటన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్" అనే టైటిల్‌తో చేసిన ఆ అధ్యయనాన్ని MedRxivలో పోస్ట్ చేయగా అది కాస్త ట్రెండింగ్ అవుతోంది.

Advertisement

MedRxiv అనేది ఒక ఆరోగ్య శాస్త్రాల ప్రీ-ప్రింట్ సర్వర్‌.ఇకపోతే ఓల్డ్ చాట్‌జీపీటీ వెర్షన్ లేదా జీపీటీ-3.5 వైద్య విద్యార్థుల బోర్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులు మాత్రమే సాధించగా లేటెస్ట్ వెర్షన్ జీపీటీ-4 దాని మునుపటి వెర్షన్‌తో పోల్చితే పరీక్షలలో మెరుగ్గా రాణించిందని తెలుస్తోంది.మెడికల్ స్టూడెంట్ బోర్డ్ పరీక్షలలో 12 ప్రశ్నల కేటగిరీలలో జీపీటీ-4 ప్రతిదానిలో వినియోగదారుల కంటే చాలా ఎక్కువ స్కోరు చేయడం విశేషం.

ఇది కణితి ప్రశ్నల విభాగంలో క్వశ్చన్ బ్యాంక్ యూజర్లతో సహా చాట్‌జీపీటీని అధిగమించింది.అధ్యయనం ప్రకారం, ఈ పరీక్షలో చాట్‌జీపీటీ (జీపీటీ-3.5) 73.4 శాతం, జీపీటీ-4 83.4 శాతం స్కోర్‌లను సాధించగా.వినియోగదారులు సగటున 73.7 శాతం మార్కులు సాధించడం కొసమెరుపు.

Advertisement

తాజా వార్తలు