Ram Charan Janasena Campaign : జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు చరణ్… ఆదేశాలు రావడమే ఆలస్యం అంటూ?

సినిమా ఇండస్ట్రీలో పనీ చేసినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు అనంతరం రాజకీయాలలోకి అడుగుపెట్టి రాజకీయాలలో కూడా మంచి సక్సెస్ సాధించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా పలువురు రాజకీయ నాయకులు రాజకీయాలలో ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారు కూడా రాజకీయాలలోకి వచ్చి తమ రాజకీయ అదృస్టాన్ని పరీక్షించుకున్నారు.ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాత్రం పట్టు వదలను విక్రమార్కుడు లాగా ఎన్ని అవమానాలు ఎదురైనా ఈయన మాత్రం ఎన్నికలలో పోటీ చేస్తూనే వస్తున్నారు.2014వ సంవత్సరంలో ఈయన తన పార్టీని మొదలుపెట్టారు.ఇక 2019 ఎన్నికలలో ఈయన రెండు నియోజకవర్గాల నుంచి నిలబడి ఓటమి పాలయ్యారు.

ఇక ఈసారి కూడా పిఠాపురం( Pithapuram ) నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ ఎన్నికలలో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.ఇక పవన్ కళ్యాణ్ తరపున మెగా హీరోలు కూడా ప్రచార కార్యక్రమాలకు వస్తారు అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

అయితే గతంలో జనసేన పార్టీ( Janasena Party ) గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) ను ప్రశ్నించగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్న రాంచరణ్ కు ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ జనసేన పార్టీ కోసం ఏం చేయడానికి అయినా ముందుగా ఉంటాము ఎందుకంటే అక్కడ ఉన్నది బాబాయి అంటూ చరణ్ తెలిపారు.

Advertisement

మరి బాబాయ్ గెలుపు కోసం పోటీ చేస్తారా అనే ప్రశ్న ఎదురు కావడంతో తాము జనసేన పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం ఏం చేయడానికి అయినా ముందుగా ఉంటామని తెలిపారు.అయితే వాళ్లు ఇలా చేయండి అని చెబితే చాలు చేయడానికి సిద్ధమేనని చరణ్ తెలిపారు.ఇక బాబాయ్ కి ఏదైనా అవసరమైతే ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తారని, ఫోన్ల ద్వారా కూడా తనకు ఫలానా అవసరం అంటూ తనకు కావలసిన పనులన్నీ చకచగా జరిగిపోయేలా చూస్తూ ఉంటారని చరణ్ తెలిపారు.

ఇకపోతే ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా భావించినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా మెగా హీరోలను రంగంలోకి దింపితే వార్ వన్ సైడేనని అభిమానులు కూడా భావిస్తున్నారు.చూడాలి మరి ఈసారైనా ఎన్నికల బరిలోకి మెగా హీరోలు ఎంట్రీ ఇస్తారా లేకుంటే పవన్ ఒకరే ఎన్నికల బరిలోకి దిగి పోరాటం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు