రెండు తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం..!!

గత రెండు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోయాయి.ప్రతిరోజు పగటిపూట 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు( Temperature ) నమోదయ్యాయి.

ఇక ఇదే సమయంలో భారత వాతావరణ కేంద్రం( IMD ) సైతం దేశవ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇదే సమయంలో 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు( Heavy Rains ) కురుస్తాయని పేర్కొంది.

ఐఏండి సూచనల ప్రకారం దక్షిణ ఉత్తర ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్, చతిస్ ఘడ్, తూర్పు జార్ఖండ్ ప్రాంతాల్లో ఎండలు దంచి కొడతాయని పేర్కొంది.

కేరళ, నాగాలాండ్, మిజోరాం, అస్సాం, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో తాజాగా వాతావరణం పూర్తిగా మారింది.నాగర్ కర్నూలు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురవడం జరిగింది.

Advertisement

వెంకటాపూర్ శివారులో పిడుగుపాటుకు మహిళా మృతి చెందింది.అదేవిధంగా రంగాపూర్ లో పిడుగుపాటుకు ఆవు మృతి చెందడం జరిగింది.

అల్లూరి జిల్లా మన్యం ప్రాంతం, రాజమండ్రిలో పలుచోట్ల భారీ వర్షం కురవటం స్టార్ట్ అయింది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది.

ఒక్కసారిగా ఎండలతో మండిపోయిన ప్రజలు.తాజా చల్లని వాతావరణంతో సేద తీరుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023
Advertisement

తాజా వార్తలు