హీరోలకు అభిమాన సంఘాలపై.. చంద్రమోహన్ షాకింగ్ కామెంట్స్?

ఒకప్పుటికీ ఇప్పటికి ఇండస్ట్రీలో ట్రెండు ఎంతగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకప్పుడు ఎవరైనా హీరోని అభిమానిస్తే ఇక తమ సినిమాలకు వెళ్లడం సూపర్ హిట్ అందించడం లాంటివి చేసేవారు ఫ్యాన్స్.

కానీ ఇటీవల కాలంలో మాత్రం చిన్న హీరోల దగ్గర నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరికి కూడా అభిమాన సంఘాలు ఏర్పడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ అభిమాన హీరో సినిమా లని ఎలివేట్ చేస్తూ అభిమాన సంఘాలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.

ఇలా టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి చోట కూడా హీరోలకు అభిమాన సంఘాలు వెలుస్తున్నాయి.హీరోలు సోదర భావంతో నే ఉన్నప్పటికీ అభిమాన సంఘాల మధ్య మాత్రం ఏకంగా శత్రుత్వం నడుస్తూ ఉండటం గమనార్హం.

ఈ క్రమంలో ఇటీవల కాలంలో అభిమాన సంఘాలు ఏకంగా వేరే హీరో సినిమా విడుదలైతే నెగిటివీటి ప్రచారం చేయడం వంటివి కూడా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.అయితే ఇలా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఫ్యాన్స్ అసోసియేషన్ లపై సీనియర్ నటుడు చంద్రమోహన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

ఈ క్రమంలోనే తాను నటనలో బిజీగా ఉన్న సమయంలో అభిమానులు ఎలా ఉండే వారు అనే విషయాలను కూడా గుర్తు చేసుకున్నారు.నిర్మాతలు ఎన్నో లక్షలు పెట్టుబడి పెట్టి చిత్రాలు తీసిన ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని బాగోగులు నిర్ణయించేది ప్రేక్షకులు.కానీ అభిమాన సంఘాలు కాదు.

కాని ఒక్కోచోట అభిమాన సంఘాలు దురాగతాలు విపరీతంగా ఉంటున్నాయి అంటూ చంద్రమోహన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇలా రెచ్చి పోయి సోషల్ మీడియాలో దురాగతాలకు పాల్పడే అభిమాన సంఘాలను హీరోలు కూడా ప్రోత్సహించకూడదు.

అయితే ఇది జరిగే పని కాదు అంటూ జవాబిచ్చారు చంద్రమోహన్.కాగా చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు