రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై చంద్రబాబు ఫోకస్

ఇప్పటికే మొదటి విడతలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ని చేపట్టిన టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ),  రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

టిడిపి, జనసేన , బిజెపి లకు చెందినవారికి ఈ పదవులు వరించినన్నాయి .

మొదటి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీలో కొంతమందికి ప్రాధాన్యం దక్కకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నారు .దీంతో రెండో విడత పోస్టుల భర్తీలో అసంతృప్తితో ఉన్న కీలక నేతలకు పదవులను కట్టబెట్టనున్నారు.ఈ పోస్టుల భర్తీ విషయమై ఉండవల్లిలోని తన నివాసంలో నిన్ననే చంద్రబాబు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. 

Chandrababus Focus Is On Filling Up The Second Round Of Nominated Posts, Tdp,

మొదటి దశలో 20 కార్పొరేషన్లకు చైర్మన్ లతో పాటు, ఆర్టీసీ కి వైస్ చైర్మన్ ను నియమించారు.  రెండో జాబితాలో దానికి రెట్టింపు సంఖ్యలో పోస్టులను భర్తీ చేసే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట .మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు ఈ ఎంపికలను సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

Chandrababus Focus Is On Filling Up The Second Round Of Nominated Posts, Tdp,

 వివిధ మార్గాల్లో వచ్చిన నివేదికల ఆధారంగా మిత్రపక్షలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు.  రాష్ట్రం యూనిట్ గా నామినేటెడ్ పదవుల్లో మిత్ర పక్షాలకు 20 శాతం పదవులు కేటాయించాలని ఇప్పటికే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.ఇక ఈ రోజు నుంచి టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కావడంతో , ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు.

Advertisement
Chandrababu's Focus Is On Filling Up The Second Round Of Nominated Posts, TDP,

ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీలో బిజెపి , జనసేన( BJP, Janasena)కు సరైన ప్రాధాన్యం ఇవ్వాలని, ఏ ఏ పదవులకు ఎవరు అర్హులనే దానిపైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు .ఇప్పటికే జనసేన , బిజెపిల నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే విషయం పైన పార్టీల నాయకులతోనూ సంప్రదింపులు చేసి , వారు సూచించిన వారి పేర్లను పరిశీలిస్తున్నారట.ఈ పోస్టుల భర్తీ తరవాత వీటిపై ఎవరు విమర్శలు చేయకుండా కూటమి పార్టీల మధ్య సఖ్యత దెబ్బ తినకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

  త్వరలోనే రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ కానుండడంతో , ఆశావాహులు ఇప్పటికే కీలక నాయకులు చుట్టు తిరుగుతూ,  తమకు కీలకమైన పదవులు దక్కేలా  పావులు కదుపుతున్నారట.

Advertisement

తాజా వార్తలు