సీనియర్లు భారం .. జూనియర్లేకే ప్రాధాన్యం ? టీడీపీ ఇలా ఫిక్స్ అయ్యిందా ?

తెలుగుదేశం పార్టీకి మళ్లీ ఊపు తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కృషి చేస్తూనే ఉన్నారు.పార్టీ పూర్తిగా దెబ్బతిన్నా,  చంద్రబాబు రాజకీయ తెలివితేటలతో ఆ పార్టీ ప్రభావం ఎక్కడ తగ్గకుండా చేస్తూ వచ్చారు.

23 సీట్లతో టిడిపి ఘోరంగా 2019 ఎన్నికల్లో ఓటమి చెందినా, పార్టీని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు.తన కుమారుడు లోకేష్ ను రాజకీయంగా ప్రమోట్ చేసే విషయయంలోనూ బాబు సక్సెస్ అయ్యారు.

పరామర్శలు ,ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ఇలా ఏదైనా రాష్ట్రంలో ఎక్కడికైనా లోకేష్ వెళ్ళిపోతున్నారు .పార్టీలో ప్రాధాన్యం పెంచుకుంటున్నారు.  వైసీపీ ప్రభుత్వం పై పోరాడుతూ, బలమైన నాయకుడిగా నిరూపించుకునేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు.

లోకేష్ దూకుడుకు బాగా మార్కులు పడుతున్నా,  సీనియర్ నాయకులు మాత్రం ఆయన విషయంలో వ్యవహరిస్తున్న తీరు అటు బాబుతో పాటు, ఇటు లోకేష్ కు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది.మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారు బహిరంగంగా మీడియా ముందు విమర్శలు చేయడం తో పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకున్న చిన్నచిన్న లోపాలపై బహిరంగంగా మాట్లాడుతూ,  పార్టీలో సీనియర్లు వ్యవహరిస్తున్న తీరు  చంద్రబాబు లోకేష్ లకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

Advertisement
Chandrababu, Lokesh, TDP, Ap, Nara Lokesh, Cbn, Ysrcp, Jagan, TDP Seniour Leader

అయితే టిడిపి, లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇక పార్టీలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం బాగా తగ్గించాలని, ఎక్కడికక్కడ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి తిరుగులేకుండా చేసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

Chandrababu, Lokesh, Tdp, Ap, Nara Lokesh, Cbn, Ysrcp, Jagan, Tdp Seniour Leader

అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఇటీవల భారీ ఎత్తున ప్రకటించిన పార్టీ పదవులలో సీనియర్ నాయకులు, పార్టీకి తమకు పెద్దగా కలిసి రాని వారిని తప్పించి, యువ నాయకత్వానికి ఎక్కువగా ప్రాధాన్యం కల్పించే విధంగా లోకేష్ చంద్రబాబులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.2024 టార్గెట్ గానే చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.త్వరలోనే దీనికి సంబంధించిన కసరత్తు మొదలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు