మద్యం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు మద్యం కేసులో విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

మద్యం కేసులో చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.కాగా మద్యం కేసులో రేపు ఏజీ వాదనలు కొనసాగనున్నాయి.

అటు ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు