టీడీపీలో ఏం జరిగినా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు తెలిసే జరగాలి.టీడీపీలో ఎవరు ఎలాంటి స్టెప్ వేసినా.
చంద్రబాబుకు తెలిసే జరగాలి.అలాకాదని ఎవరైనా దూకుడు ప్రదర్శించాలని చూస్తే.
ఇదిగో ఇప్పుడు ఎంపీ కె.రామ్మో హన్ నాయుడుకు జరిగినట్టే జరుగుతుంది.విషయంలోకి వెళ్తే.
సీనియర్ కాంగ్రెస్ నేత, దివంగత కింజరాపు ఎర్రన్నా యుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు 2014లో శ్రీకాకుళం ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.తండ్రి వారసత్వంగా వచ్చిన రాజకీయాలను ఆయన కూడా కొనసాగిస్తున్నారు.
లోక్‌సభలో పలు ప్రశ్నలు సంధించడం ద్వారా మీడియా దృష్టిని సైతం ఆకర్షించాడు.ఇక, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేస్తున్న తొండిని ఎండగట్టడంలో రామ్మోహన్ నాయుడు సక్సెస్ అయ్యారు.ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంటులో టీడీపీ ఎంపీలు చేసిన ఆందోళనలో కీలకంగా వ్యవహరించాడు.
ప్రధాని ఇంటి ముందు చేసిన ధర్నా విషయంలోనూ ఆయన కీలకంగానే ఉన్నారు.పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఏపీకి అన్యాయం చేస్తున్న ప్రధాని మోడీకి తగిన గుణపాఠం చెబుతారంటూ శాపనార్థాలు కూడా పెట్టారు.
ఇలా కేంద్రంపై ఏపీ విషయంలో ఒంటికాలిపై లేవడంలో కొత్త నేత అనే పేరు తుడిచేసుకున్నారు.ఆ తర్వాత కూడా ఎంపీల కార్యాచరణ కోసం అమరావతిలో నిర్వహించిన ఎంపీల సమావేశంలో కూడా రామ్మోహన్ చురుగ్గానే మాట్లాడాడు.
ఇక, ఇప్పుడు తాజా విషయంలోకి వెళ్తే.ఆయన మెరుపు దీక్షకు దిగారు.
శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌లో సోమవారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభించిన ఈ దీక్ష.మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ముగించారు.
దాదాపు 12 గంటల పాటు ఆయన విశాఖ రైల్వేజోన్ డిమాండ్‌తో దీక్షకు దిగారు.దీనికి విస్తృతంగా ప్రచారం వస్తుందని ఆయన భావించారు.
అయితే, అనూహ్యంగా మీడియాకు ఆశించిన మేరకు ప్రచారం చేయలేదు.నిజానికి మెరుపు దీక్షకు దిగడం, 12 గంటలపాటు దీక్ష చేయడం అదికూడా రాత్రి వేళ రైల్వే స్టేషన్‌లో అంటే.
రామ్మోహన్‌కు మంచి ప్రచారం వస్తుందని ఆయన భావించారు.కానీ, టీడీపీ అనుకూల మీడియాలోనూ రామ్మోహన్‌కు అనుకున్నంత ప్రచారం రాలేదు.
దీనిపై ఆసక్తికర చర్చ ఆలస్యంగా వెలుగు చూసింది.రామ్మోహన్ మెరుపు దీక్ష విషయం పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియదని, ఆయన అనుమతి కూడా లేకుండానే రామ్మోహన్ దీక్షకు దిగాడని.
అందుకే బాబుకు కోపం వచ్చిందని, ఫలితంగా మీడియా ఈ దీక్షను పెద్దగా కవర్ చేయలేదని అంటున్నారు.అయితే, మరో వర్గం మాత్రం బాబు ఎలాగూ ఈ నెల 20న దీక్ష చేయాలని వారం కిందటే నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు ఇలా ఎంపీ సడెన్‌గా దీక్షకు దిగడం వల్ల ఏం సాధించారని ? అనేవారు కూడా ఉన్నారు.ఏదేమైనా రామ్మోహన్‌నాయుడు చేసింది మంచి పని అయినా ఆయనకు ప్లస్ చేకూరలేదు.
మొత్తానికి రామ్మోహన్ దీక్ష.విషయం మాత్రం ఆశించిన మేరకు ప్రచారానికి నోచుకోకుపోవడం గమనార్హం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy