కోడెల శివప్రసాద్ రెండో వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు సీరియస్ కామెంట్స్..!!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రెండో వర్ధంతి కార్యక్రమాన్ని టిడిపి శ్రేణులు మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు కీలక నాయకులు.

పాల్గొని ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.

Chandrababu Serious Comments On Kodela Shiva Prasad Chandrababu, Kodela Shiva Pr

పల్నాటి ప్రాంతంలో నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేసిన నాయకుడు కోడెల శివప్రసాద్ అని కొనియాడారు.పరువు ప్రతిష్ట లతో క్లియర్ కట్ పాలిటిక్స్ చేసే కోడెల చివరికి ఆ పరువు కోసమే ప్రాణాలు విడిచారు అని.కచ్చితంగా కోడెలది ప్రభుత్వ హత్యే అని చంద్రబాబు ధ్వజమెత్తారు.ఎంతో ధైర్యం కలిగిన కోడెల.

వైసీపీ అధికారంలోకి వచ్చాక వేధింపులు ఎక్కువ కావటంతో ఆత్మస్థైర్యం కోల్పోయి.తన ప్రాణాలు తానే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

Advertisement

ఎంతో హుందాగా రాజకీయాలు చేసే కోడెల పై దారుణమైన ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం చేయడం జరిగిందని.వైసిపి ప్రభుత్వం కారణంగా.

ఒక్క కోడెల శివప్రసాద్ మాత్రమే కాక తెలుగుదేశం పార్టీలో అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమయంలో కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం ఘటనలను ఉదాహరణగా పేర్కొన్నారు.

ఇంకా కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితం గురించి చంద్రబాబు తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు