పెద్దాపురం రోడ్ షోలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇదేం కర్మరా బాబు

ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం జగన్ సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసారని విమర్శించారు.

పోలీసుల వ్యవస్థను వాడుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.పోలీసులు మంచివాళ్లే.

జగనే వాళ్ల మెడపై కత్తి పెట్టారు.ఇక పెద్దాపురంలో కొండలు మాయమైపోతున్నాయి.

Advertisement

₹40 కోట్ల రూపాయల విలువైన భూములను.వైసీపీ నేతలు కబ్జా చేయాలని చూస్తున్నారు అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోతే ఎక్కడికి పారిపోతాడో ఏ జైలుకి పోతాడో తెలియదు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే సందర్భంలో మొక్కజొన్న మరియు మిర్చి రైతులతో చంద్రబాబు భేటీ కావడం జరిగింది.కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో చంద్రబాబుకి భారీ ఘన స్వాగతం లభించింది.టిడిపి శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్ వెంట భారీగా ర్యాలీగా కదిలారు.

ఇదే కార్యక్రమంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప కూడా పాల్గొనడం జరిగింది.రోడ్ షో అనంతరం విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వీళ్ళందరికీ ఎన్నో లక్ష్యాలు ఉంటాయి.ఆ లక్ష్యాలను చేరుకునేలా వారికి అవకాశాలు కల్పించడం పాలకుల యొక్క విధి.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అని సోషల్ మీడియాలో వారితో ఫోటోలు దిగి చంద్రబాబు కామెంట్ పెట్టడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు