ఊహించని ఫలితాలు రాబోతున్నాయి అంటున్న చంద్రబాబు..!!

ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) సంతోషం వ్యక్తం చేశారు.ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కసి ప్రతి ఓటర్ లో కనిపించింది అన్నారు.ప్రజాస్వామ్య స్ఫూర్తితో వైకాపా( YCP ) కుట్రలు టీడీపీ( TDP ) శ్రేణులు ఎక్కడికక్కడ భగ్నం చేశాయని అన్నారు.

ఓటమి భయంతోనే ఎన్నికలవేళ కుట్రలు పన్నుతూ వచ్చారని అధికార పార్టీపై మండిపడ్డారు.హింసను ప్రేరేపించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు.

అయితే తాము దీటుగా ఎదుర్కోవటంతో వారి ఆటలు సాగలేదని అన్నారు.సోమవారం రాత్రి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement
Chandrababu Says Unexpected Results Are Coming TDP Details, Chandrababu, AP Poli

కచ్చితంగా అధికారంలోకి వస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు.

Chandrababu Says Unexpected Results Are Coming Tdp Details, Chandrababu, Ap Poli

2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ, జనసేన పార్టీలతో( BJP Janasena ) పొత్తులు పెట్టుకుని జాగ్రత్త పడ్డారు.గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఉభయగోదావరి జిల్లాలలో అనేకచోట్ల చంద్రబాబు పవన్ చేసిన ప్రచారం కూటమి పార్టీలలో జోష్ నింపింది.ఇంకా ఎన్నికల ప్రచారం చివరి వారంలో బీజేపీ పెద్దలతో అనేకచోట్ల బహిరంగ సభలు పెట్టడం జరిగింది.

ఓవరాల్ గా చూసుకుంటే 2014లో మాదిరిగానే ఈసారి ఎన్నికలలో గెలుస్తామని కూటమి నేతలు తాజా పోలింగ్ సరళి బట్టి కామెంట్లు చేస్తున్నారు.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు