టీడీపీ గెలవడం చారిత్రాత్మక అవసరం! చంద్రబాబు!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకి పదును పెడుతూ ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇక అధికార టీడీపీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల కసరత్తు మొదలెట్టి నియోజక వర్గాల వారీగా ఓ వైపు అభ్యర్ధులని ఎంపిక చేస్తూనే మరో వైపు నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నివర్హిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

రానున్న ఎన్నికలలో టీడీపీ మళ్ళీ గెలవడం చారీత్రాత్మక అవసరం అని చెప్పిన చంద్రబాబు, దానికోసం అందరూ కలిసి పని చేయాలని, విభేదాలు మరిచి ఒకటిగా పనిచేస్తే టీడీపీ గెలుపుని ఎవరు ఆపలేరని చంద్రబాబు తెలియజేసారు.అప్పట్లో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం కేంద్రంతో ఎన్టీఆర్ ఎలా పోరాటం చేసారో మహానాయకుడు సినిమాలో చూపించారని, ఇప్పుడు మరల కేంద్రంతో నేను పోరాటం చేస్తున్నా అని, ఈ కారణంగా మహానాయకుడు సినిమాని ప్రజలలోకి తీసుకెళ్ళి, తెలుగు దేశం ఆశయాలు, సిద్ధాంతాలని ప్రజలలోకి తీసుకెళ్లాలని చెప్పారు.

అలాగే మోడీ విశాఖ పర్యటనలో అందరూ నిరసన తెలియజేసి గట్టిగా నిలదీయాలని, విభజన హామీలు, ప్రత్యెక హోదాపై విషయంలో ఏపీ ప్రజలని మోసం చేసిన మోడీ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఏపీలో అడుగుపెట్టాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో జరిగిన కాన్ఫరెన్స్ లో సూచించారు.

ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!
Advertisement

తాజా వార్తలు