సాయంత్రం ఏం జరుగుతుంది?

ఇది క్రైమ్‌ సినిమా టైటిల్‌ కాదు.రామ్‌గోపాల్‌ వర్మ మూవీ కాదు.

రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీ దక్షిణాది రాష్ర్టాల విడిదిలో భాగంగా సోమవారం హైదరాబాదుకు చేరుకున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బృందం ప్రణబ్‌కు ఘన స్వాగతం పలికినా, ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లలేకపోయారు.

కొన్ని నిబంధనలు ఆయనకు ఇబ్బంది కలిగించేవిగా ఉండటంతో మానుకున్నారు.అయితే పెద్దాయన నగరానికి వచ్చారు కాబట్టి ఉమ్మడి రాష్ర్ట గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్లో ఈరోజు (మంగళవారం) సాయంత్ర విందు ఏర్పాటు చేసి ఇద్దరు ముఖ్యమంత్రులను కుటుంబ సమేతంగా ఆహ్వానించారు.

ఈ జాబితాలో ఇంకొందరు ప్రముఖులు కూడా ఉన్నారనుకోండి.అది వేరే విషయం.

Advertisement

పెద్దవాళ్ల వస్తే ఇలాంటి విందులు ఇవ్వడం ఆనవాయితీయే కదా.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల్లో రాజకీయ వాతావరణం బాగా హీటెక్కి ఉన్న నేపథ్యంలో, నెల రోజులకు పైగా ఇద్దరు చంద్రుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న పరిస్థితిలో ఈ విందుకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది.దేశానికే పెద్దాయన వచ్చారు.

రెండు రాష్ర్టాల పెద్దాయన పిలిచారు.అలాంటప్పుడు ఇద్దరు చంద్రులు తప్పనిసరిగా వెళ్లాల్సిందే కదా.! మనసులో ఎవరిమీదనో కోపం పెట్టుకొని వెళ్లకపోతే పెద్దవాళ్లను అవమానించినట్లుగా ఉంటుంది.అయితే ఈ సాయంత్రం ఇద్దరు చంద్రులు ఎలా వ్యవహరిస్తారు? అన్నదే ఆసక్తికరంగా మారింది.మాట్లాడుకుంటారా? కనీసం ముఖాలు చూసుకుంటారా? ఒకరిని చూసి ఒకరు పలకరింపుగానైనా చిరునవ్వు నవ్వుతారా? కరచాలనం చేసుకుంటారా? .అసలేం జరుగుతుంది మనకు తెలియాలి అనుకుంటున్నారు జనం.చంద్రులు ఎలా వ్యవహరించినా అది మీడియాకు పెద్ద వార్తే.ఎందుకంటే ప్రతికూల పరిస్థితిలో, ద్వేష భావాలు నింపుకున్న స్థితిలో వీరు కలుస్తున్నారు.

గతంలోనూ ఇద్దరు మధ్య వివాదాలు తలెత్తినప్పుడు గవర్నర్‌ రాజ్‌భవన్‌కు పిలిపించి మాట్లాడించారు.మరి ఇప్పుడేమవుతుందో.!.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
Advertisement