చంద్రబాబు కి ఓటమి భయం పట్టుకుందా..వీటికి భయపడుతున్నాడా...?

ఏపీ లో సీనియర్ నాయకుడిని.దేశం మొత్తంలో నా అంత సీనియర్ లేడు.

నేను ఎవ్వరికి భయపడను అంటూ చెప్పుకునే చంద్రబాబు.ఇప్పుడు ఒక విషయంలో మాత్రం తెగ భయపడిపోతున్నాడట.

కేంద్రం మెడలు వంచుతా అంటూ వార్నింగ్ ఇచ్చే చంద్రబాబు ఒకే ఒక్క విషయంలో తెగ మదన పడుతున్నాడట.గెలుపు పై ధీమా ఉంది కానీ వాటిపై నమ్మకం లేదు అంటూ సన్నిహితుల వద్ద బాబు వాపోతున్నారు అని టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ చంద్రబాబు కి ఎందుకు ఓటమి బెంగ పట్టుకుని.చంద్రబు వేటిని చూసి భయపడుతున్నారు అనే వివరాలలో వెళ్తే.

Advertisement

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా బీజేపి గెలుపు సొంతం చేసుకుంది.వరుసగా బీజేపి తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకోవడం తాజాగా కర్ణాటక ఎన్నికల్లో ఎవరి పొత్తు లేకుండానే 104 సీట్లు కైవసం చేసుకుని ప్రాంతీయ పార్టీలకి ఘలక్ ఇచ్చింది అయితే ఇంతటి భారీ గెలుపు వెనుకాల బీజేపి వరుస విజయాల పై ఈవీఎంల మీద ఎన్నో అనుమానాలు తలెత్తాయి.ఈవీఎంల ట్యాంపరింగ్ మూలంగానే బీజేపీ గెలుపు సులువు అవుతున్నదని ఎన్నికల వ్యవస్థను బీజేపీ అపహాస్యం చేస్తుందని ఆరోపణలు వచ్చాయి.

అయితే బీజేపి గెలుపుకి ఈవీఎం ల కి సంభంధం లేదని వాదిస్తోంది ఎన్నికల కమిషన్.ఎన్నిల కమిషన్ ఎంత వాదించినా సరే కేంద్రంతో తెగతెంపులు చెసుకున్న చంద్రబాబు కి మాత్రం భయం పట్టుకుంది హైటెక్ ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈవీఎంల గురించి ఇప్పుడు ఆందోళన చెందడం అందరిని ఆశ్చర్యపెడుతోంది.

ఈవీఎంలని దుర్వినియోగం చేయడం ఎంతో సులభమని అందుకే వాటి విషయంలో ఎంతో జాగ్రత్తా ఉండాలని బాబు నేతలకి చెప్తున్నారట.అమరావతిలోని ప్రజాదర్బార్ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఈవీఎంల పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారట.అంతేకాదు గతంలో చంద్రబాబు ఈవీఎంల లని ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చనే విషయాన్ని ఎన్నికల కమిషన్ వద్దకి వెళ్లి మరీ ఆధారాలతో చూపించిన విషయాన్ని మంత్రి కాల్వ శ్రీనివాసులు గుర్తు చేశారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
పెళ్లి కొడుకే స్వయంగా మంత్రాలు చదువుతూ పూజారిగా మారాడు.. వీడియో చూస్తే అవాక్కవుతారు!

బ్యాలెట్ పేపర్ అయితే ఎవరికీ అనుమానం ఉండదు ఎంతో మంది నేతలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈవీఎంల ని వ్యతిరేకిస్తున్నారు అలాంటప్పుడు ఎందుకు వాటిని కోసాగించడం అంటూ ఈ చర్చని జాతీయ స్థాయిలో తీసుకువెళ్తామని తెలిపారట.అయితే తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చంద్రబాబు కేవలం ఈవీఎం లకి భయపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటున్నారు విశ్లేషకులు .

Advertisement

తాజా వార్తలు