2019 వార్‌... బాబుకు చెమ‌ట‌లు స్టార్ట్‌

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు! ఈరోజు ఉన్న హ‌వా రేప‌టికి మ‌టుమాయం కావొచ్చు! 2014లో ఇది అనుభ‌వం కూడా అయింది.అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ తిరుగులేదు.

జ‌గ‌నే సీఎం అని అంద‌రూ అన్నారు.ఆఖ‌రుకు.

రాజ‌కీయ గండ భేరుండ‌ల‌కు సైతం చెమ‌ట‌లు ప‌ట్టించి ప్ర‌త్యేక రాష్ట్రం సాధించుకున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సైతం.ఏపీలో జ‌గ‌న్ ప్ర‌బుత్వం వ‌స్తుంద‌ని జోస్యం చెప్పారు.

అయితే, ఫ‌లితాలు వ‌చ్చాక సీన్ రివ‌ర్స్.అస‌లు ఉనికిలోకూడా ఉండ‌ద‌ని అనుకున్న చంద్ర‌బాబు పార్టీ అధికారంలోకి వ‌చ్చేసింది.

Advertisement

ముచ్చ‌ట‌గా నాలుగేళ్లు పూర్తి కూడా చేసుకుంది.ఇదీ.ప‌రిస్థితి.

క్ష‌ణ‌క్ష‌ణ‌ముల్ ప్ర‌జ‌ల చిత్త‌ముల ప్ర‌కార‌మే రాజ‌కీయాలు, రాజ‌కీయ నాయ‌కుల భ‌విష్య‌తు తిర‌గ‌బ‌డుతూ ఉంటుంద‌న డంలో సందేహం లేదు.తాజాగా ఏపీ విష‌యానికి వ‌స్తే.

మ‌రో ప‌దిమాసాల్లో ఇక్క‌డ ఎన్నిక‌లు ఉన్నాయి.ప్ర‌స్తుత అధికార పార్టీ టీడీపీ.

మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.ప్ర‌జ‌ల‌ను ఆదిశ‌గా కూడా స‌మాయ‌త్తం చేస్తున్నారు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఇంతకీ.. కుప్పంలో బాబు గారి పరిస్థితేంటి ? 

అయితే, ఆయ‌న‌కు అనుకూలంగా ప్ర‌జ‌లు ఉన్నారా? మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఓట్లేస్తారా? తిరిగి బాబునే సీఎంను చేస్తారా? అనే ప్ర‌శ్న‌లు రాష్ట్రంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.తాజాగా ఈ విష‌యంపైనే ఓ మీడియా సంస్థ స‌ర్వే చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

జాతీయ స్థాయిలో పేరెన్నిక గల ఆ సంస్థ చేసిన అధ్యయనంలో చంద్రబాబుకు షాకింగ్ లాంటి ఫలితాలు వచ్చాయి.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు? అని ఆ సంస్థ అడిగిన ప్రశ్నకు 42 శాతం మంది జగన్ అని సమాధానం ఇచ్చార‌ని తెలుస్తోది.చంద్రబాబుకు ఓటేస్తామన్నది 30 శాతం మందే.

పవన్ కల్యాణ్ వాటా 19గా ఉంది.చంద్రబాబు అనుభవం ఏపీ డెవలప్‌మెంట్‌కు ఉపయోగిపడిందా? అనే ప్రశ్నకు 59 శాతం మంది నో అని చెప్పారు.ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం పెరుగుతోందా? అనే ప్రశ్నకు 67 శాతం ఔను అన్నారు.హోదా సాధనలో బాబు ఫెయిలయ్యాడా? అంటే, 76 శాతం మంది ఏకగ్రీవంగా ఔను అన్నారు.హోదా విషయంలో చంద్రబాబు మాట మార్పులతో ఆయనను ప్రజలు విశ్వసించడం లేదని ఈస‌ర్వే చెబుతోంది.

చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిందా? అనే ప్రశ్నకు 60 శాతం మంది ఔనన్నారు.బాబు పాలన ఏమాత్రం బాగోలేదని 57 శాతం మంది తేల్చి చెప్పారు.

మొత్తంగా ఈఫ‌లితాలు.బాబుకు మ‌రింత టెన్ష‌న్ పెంచేలా ఉన్నాయ‌ని స‌మాచారం.

ఈ సంద‌ర్భంలోనే మ‌రో మాట కూడా చెప్పుకోవాలి.ఇటీవ‌ల అమ‌రావ‌తికి వ‌చ్చిన ఆంధ్రా ఆక్టోప‌స్‌.

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సైతం.చంద్ర‌బాబు మ‌ళ్లీ గెలుస్తాడా? అన్న మీడియా ప్ర‌శ్న‌కు ``వేచి చూడాలి`` అని స‌మాధానం చెప్ప‌డం గ‌మ‌నార్హం.

తాజా వార్తలు