వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అధికారం శాశ్వతం కాదన్న ఆయన అభివృద్ధి మాత్రమే శాశ్వతమన్నారు.

తాము అన్ని వర్గాల ప్రజలకు మంచి చేశామని చెప్పారు.వైసీపీ పాలనలో మత్స్యకారులది దారుణమైన పరిస్థితి అని తెలిపారు.

బీసీ మంత్రి బొత్స ఏమయ్యారన్న చంద్రబాబు ఎవరో ఇక్కడ పెత్తనం చేస్తుంటే ఆయనేం చేస్తున్నారని ప్రశ్నించారు.వ్యవసాయ, ఉపాధి రంగాలను సైతం వైసీపీని నాశనం చేసిందని ఆరోపించారు.

వ్యవసాయానికి మీటర్లు పెట్టి పేద రైతుల నడ్డి విరిచారని విమర్శించారు.బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.

Advertisement

ఈ నేపథ్యంలో వెనుకబడ్డ వర్గాల వారి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తానన్నారు.ఎవరూ భయపడొద్దని, అందరికీ తాను అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

The Foods That Help To Kill Breast Cancer Details
Advertisement

తాజా వార్తలు